Andhra Mahabharatamu 3.4.280
Āndhra Mahābhāratamu 3.4.280
- Language
- Telugu
3.4.280
వ. నారాయణాభిధానుండ నైన యేను బాలరూపంబున శంఖచక్రగదాధరుండ నై యేకార్ణవంబునందు మహాయుగసహస్రసమయంబయిన కాలంబున యోగనిద్రాపరవశుండనై యుండుదు; నిట్టి దారుణకల్పాంతంబు సూచి నీవు భీతుండ వగు టెఱింగి, నీవలని యనుగ్రహంబున నాత్మగుప్తంబు లైన సకలలోకంబులు గనునట్టి తెఱంగుఁ గావించితి; నీ వింక నిశ్శంకహృదయుండ వయి వలసినయెడం జరియింపుము; మదీయనాభికమలకర్ణికాశయనుం డయి యున్న చతురాననుండు మేల్కని సృజియించు లోకంబు లేర్పడం జూచెద’ వని యానతిచ్చి యద్దేవుం డచ్చోటన యంతర్హితుం డయ్యె; నత్యంత విచిత్రం బైన యీవృత్తాంతంబు నాకు ననుభవగోచరం బైనయది.