Andhra Mahabharatamu 3.5.270
Āndhra Mahābhāratamu 3.5.270
- Language
- Telugu
3.5.270
వ. ఇట్లు మహిషాసుర సంరక్షితం బయిన దానవసైన్యంబు పఱతెంచి చుట్టుముట్టి యసంఖ్యసాయకంబులు గదాఖడ్గ ముసల పరిఘశతఘ్ని ప్రముఖానేక ప్రహరణంబులు ప్రయోగించి, నిమిషమాత్రంబున ననిమిష సైన్యంబునం బ్రచుర మాతంగ తురంగ రథిక పదాతి ప్రకరంబులం బరిమార్చినం గార్చిచ్చు పొదివినం జెదరి పఱచు మృగంబులుం బోలె నమరులు సమరవిముఖులై తొలంగం బాఱినం జూచి నముచిసూదనుండు సింహనాదంబు సేయుచు నెలుంగెత్తి సురగణంబుల కిట్లనియె.