Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.277

Āndhra Mahābhāratamu 3.5.277

Language
Telugu

3.5.277

వ. ఇట్లు నిహన్యమానంబు లగుచు దైత్యసైన్యంబులు దైన్యంబు నొంది నిలువ నోపక నలుదెసలం జెదరిన నొదరి యందఱి నదల్చి మహిషాసురుం డొక్కమహాశైలంబు వెఱికి యిరుగేల నమర్చికొని యమరులమీఁదం గవిసినం గని, జనితోత్సాహం బైన యసురానీకం బతనిం గూడుకొని భేరీ నిస్సాణ పణవాది తూర్య రవంబులు సింహనాదంబులుఁ జెలంగం గడంగిన, నింద్రాది సురులును బెలుచ సంగరోన్ముఖులై నిలిచిన.