Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.285

Āndhra Mahābhāratamu 3.5.285

Language
Telugu

3.5.285

వ. ఇవ్విధంబున మహిషాసురుం బరిమార్చి కుమారుండు మఱియు నమ్మహాశక్తిం బునః పునః ప్రయోగంబు గావించుచు ననేకదైత్యదానవ శతసహస్రంబుల వధియించె; నద్దేవుని పారిషదగణంబుం గవిసి యసురులం దునిమి తూఁటాడి తదీయరక్తపాన మాంసఖాదనంబులు సేసి మత్తిల్లి యాడుచుం బాడుచు నతనిఁ గొనియాడుచు విహరించె; నిట్లు వైరులం బొలియించి తిమిరంబు విరియించిన తిమిర వైరియుం బోలె వెలుంగుచున్న కార్తికేయు నజేయుం జేర నరుగుదెంచి దేవేంద్రుం డతనిం గౌఁగిటం జేర్చి యిట్లనియె.