Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.290

Āndhra Mahābhāratamu 3.5.290

Language
Telugu

3.5.290

వ. అని మార్కండేయుండు సెప్పినఁ బాండవులు సంతుష్టహృదయు లై యమ్మహాత్మునిం బ్రశంసించిరి; వా రివ్విధంబున నభీష్టకథాగోష్ఠిం బ్రవర్తిల్లు నెడఁ గృష్ణవల్లభ యైన సత్యభామయుఁ బాంచాలియు నేకతంబ యొక్క యెడఁ బ్రియసల్లాపసంసక్తలై యుండి; రప్పుడు సత్యభామ ద్రౌపది కి ట్లనియె.