Andhra Mahabharatamu 3.5.307
Āndhra Mahābhāratamu 3.5.307
- Language
- Telugu
3.5.307
వ. మఱియు ధర్మరాజునగరియందుఁ గనకమణిమయ భూషణాలంకృతు లయిన పరిచారకులు నూఱువేలు రేయును బగలును బాత్రహస్తులై యభ్యాగత భోజనంబు లొడఁగూర్చువారు నందఱ గలరు; వీ రెల్ల నిట్టిట్టిమెలఁకువ మెలంగుదు రని తత్కృతాకృతంబు లేన యెఱుంగుదు; నిరంతర మదధారా తరంగిత కపోలంబు లయిన భద్రగజశతసహస్రంబులుఁ బ్రభూతజవసత్త్వసన్నుతంబు లయిన యుత్తమాశ్వ శతసహస్రంబులుం గలవు; వానికి నన్నింటికి నిత్యోచితంబు లయిన ఖాద్యంబు లొనరింపను బాలింపను దగినవారి నేన నియమింతు; నఖండభాండాగారపూరితంబు లయిన యగణ్యమణి కనకాదివస్తువులను బ్రతిదినవిహితంబు లయిన యాయ వ్యయంబులు నా యెఱుంగని యవియు లేవు; గోపాల జనంబులు దుదిగాఁ గల సకల భృత్య జనంబుల జీవితంబుల నరసి యేన నడపుదుం; బరమయశోధను లగు పాండునందనులు నిజకుటుంబభారంబు సర్వంబు నాయంద సమర్పించి తారు నిర్భరులై యిష్టవిహారంబుల నుండుదు; రే నెల్ల వెంటల నప్రమత్త నై వర్తింతు.