Andhra Mahabharatamu 3.5.324
Āndhra Mahābhāratamu 3.5.324
- Language
- Telugu
3.5.324
వ. ప్రతివింధ్యాదు లైన నీ పుత్త్రు లేన్‌వురు నిప్పుడు వచ్చి యదుపురంబున నున్నవారు; వారికి నొక్కటం గొఱంత లేదు; రుక్మిణియు సుభద్రయుఁ దక్కినవారలు నక్కుమారుల యెడం దమ కొడుకుల కంటె గారవంబు సేయుదురు; వారి దెస నిశ్చింతవు గ’ మ్మనియె; నయ్యవసరంబునం గృష్ణుండు పాండవుల వీడ్కొని మార్కండేయాది విప్రజనంబు నామంత్రణంబు సేసి గమనోన్ముఖుం డగుటయు, సత్యభామ యాజ్ఞసేనిం గౌఁగిలించుకొని సగౌరవంబుగా వీడ్కొనియె; నంత వాసుదేవుండును బ్రియాసహితంబుగా రథారూఢుం డై ద్వారవతీపురంబున కరిగె; మార్కండేయుండును బాండవేయుల నాశ్వాసించి నిజాశ్రమంబునకుం జనియె; నని చెప్పిన వైశంపాయనునకు జనమేజయుం డి ట్లనియె.