Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.326

Āndhra Mahābhāratamu 3.5.326

Language
Telugu

3.5.326

వ. అనిన నమ్మునీశ్వరుం డిట్లని చెప్పెఁ; ‘గృష్ణుండు సనిన యనంతరంబ పాండవులు గామ్యకవన నివాసంబు పరిత్యజించి, యనేక వన శైల నదనదీ విశేషంబు లాలోకించుచు ద్వైతవనంబునకుం జని, యం దున్న యెడం గరిపురంబున నుండి యొక్క బ్రాహ్మణుండు సరసకథాకథనకుశలుండు సనుదెంచి, కౌంతేయులం గని, యుచితసల్లాపంబు సేసి, మగిడి ధృతరాష్ట్రుపాలికిం జనిన, నమ్మహీపాలుండు పాండవుల కుశలం బడుగుటయు, నవ్విప్రుండు వా రేవురు ననవరతశీతవాతాతపకర్శితాంగులై బహుదుఃఖసాగరంబున మునింగియున్న వా రనియు, వీరనాథ యయ్యును ననాథయుం బోలెఁ బాంచాలి పరమశోకార్తయై యున్నది యనియుం జెప్పిన విని, వైచిత్రవీర్యుండు విషణ్ణహృదయుండై కన్నీరు దొరుఁగం గొండొకసేపు వలుక కుండి, పదంపడి నిట్టూర్పు నిగిడించి గద్గదకంఠుం డగుచు నిట్లనియె.