Andhra Mahabharatamu 3.6.363
Āndhra Mahābhāratamu 3.6.363
- Language
- Telugu
3.6.363
వ. ఏను విశ్వావసుం డను గంధర్వుండ; బ్రహ్మశాపంబునం జేసి రాక్షసత్వంబు నొంది మీవలన శాపమోక్షంబు వడసితి; రావణుం డను రక్కసుండు జానకిం గొనిపోయి, లంకానగరంబున నునిచినవాఁడు; మీకు హితోపదేశంబు సేసెద; నిట పోవంబోవఁ బంపాభిధానం బయిన సరోవరంబు గలదు; దాని యావల ఋశ్యమూకం బనుశైలంబునందు వాలిసహోదరుండు సుగ్రీవుం డను వానరుండు సచివ చతుష్టయ సహితుండై యుండు; నతనితోడ సఖ్యంబు సేయుము; దానం జేసి నీకుఁ గార్యసిద్ధి యగు’ నని పలికి గంధర్వుండు వారి వీడ్కొని నిజేచ్ఛం జనియెఁ; దదనంతరంబ యట చని చని.