Andhra Mahabharatamu 3.6.368
Āndhra Mahābhāratamu 3.6.368
- Language
- Telugu
3.6.368
వ. తదనంతరంబ యయ్యిరువురుం బంపాసరోవరంబునం గృతస్నాను లయి దేవపితృతర్పణంబులు సేసి చని ముందట నతిబహుళబలాహకవ్యూహసన్నాహసమున్నతంబు లైన యభంగోత్తుంగ శృంగసముదయంబుల నఖిలగగన క్రోడపీడనంబు సేయుచున్న దాని ఋశ్యమూకశైలంబుఁ జేరి తదుపకంఠప్రదేశంబున విశ్రమించి యున్నంత.