Andhra Mahabharatamu 3.6.370
Āndhra Mahābhāratamu 3.6.370
- Language
- Telugu
3.6.370
వ. సుగ్రీవుండును మున్ను సీతాపరిత్యక్తంబై తమ ముందటం బడినం దారు గైకొని సంగ్రహించియున్న భూషణ నిచయంబు రామునకు నివేదించినంజూచి, యతండు సముత్సుకుండై వానికి వానరైశ్వర్యంబు ప్రతిశ్రుతంబు సేసి తదీయశత్రుం డైన వాలిం జంపఁ బ్రతిజ్ఞ సేసెఁ; గపీశ్వరుండును జానకిం దెచ్చుటకు సహాయంబుగా నొడంబడియె; నంతట నందఱుం గూడికొని వాలి నివాసం బైన కిష్కంధానగరంబున కరిగి; రప్పుడు భానుసూనుండును.