Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.372

Āndhra Mahābhāratamu 3.6.372

Language
Telugu

3.6.372

వ. సమరసన్నాహం బమర వెలువడంబోయినఁ దదీయవల్లభ యగు తార యతని వారించి యిట్లను; ‘నేఁటిచందంబు సూడ సుగ్రీవుండు బలవత్సహాయుండై వచ్చినవాఁ; డది యెట్లనిన దశరథనందనుం డైన రాముండు రావణుచేత నపహృతదారుం డయి, నిజసహోదరుం డగు లక్ష్మణుండును దానును సుగ్రీవ సహాయత్వం బపేక్షించి యతనికార్యంబు దీర్పంబూనె నని వింటి; నదియునుంగాక మహాబలు లైన మైందద్వివిదులు నతిలోకపౌరుషుం డయిన హనుమయు బ్రసిద్ధబుద్ధి యగు జాంబవంతుండును వానికి మంత్రులై యుండుదురు; గావున నీ విప్పుడు గయ్యంబునకుఁ బోక నా కిష్టంబు గా’ దనిన, నవ్వుచు నవ్వనచరవీరుండు.