Andhra Mahabharatamu 3.6.385
Āndhra Mahābhāratamu 3.6.385
- Language
- Telugu
3.6.385
వ. మఱియు నన్యోన్యదంతనఖముఖవిఖండితశరీరులై హరివీరులు రుధిరధారలం దడిసి పుష్పితంబు లగు నశోకంబులుం బోలె నొప్పి చలంబులు మెఱయం బెనంగునెడం దుల్యబలరూపవిక్రములై యున్న యయ్యన్నదమ్ముల నిరువుర నేర్పడ లక్షింపనేరక లక్ష్మణాగ్రజుండు విలక్ష్యహృదయుండై వీక్షించుచున్న నాంజనేయుండు రాఘవునకు నభిజ్ఞానార్థంబుగా నొక్కపల్లవదామంబు సుగ్రీవునఱుతం బెట్టఁదదనంతరంబ రాఘవుం డమోఘబాణంబు దొడిగి వాలియురంబు వగుల నేసినం, బడి యవ్వానరుండు దశరథనందను నిందించుచుఁ బ్రాణవియోగంబు నొందె; నిత్తెఱంగున.