Andhra Mahabharatamu 3.6.391
Āndhra Mahābhāratamu 3.6.391
- Language
- Telugu
3.6.391
వ. అమ్మగువ కాపున్న దనుజాంగనలు త్ర్యక్షియు లలాటాక్షియుఁ ద్రిస్తనియు నేకపాదయు దీర్ఘజిహ్వయు నజిహ్వయుఁ ద్రిజటయు నేకలోచనయు మొదలయిన వారు పెక్కండ్రు వికృతాకారంబులతోడ నయ్యబలం బరివేష్టించి యహర్నిశంబును నుఱక యదల్చువారును బెలుచం దిట్టువారును ఖరోష్ట్రనిస్వనంబులు సెలంగ వెఱపించువారును ద్రిభువనాధిపతియైన మన దశగ్రీవునొల్లని యీ దుష్టమానుషిఁబట్టి చెండి కండలు దిందు మనువారునునై యున్న నయ్యుగ్మలి గళద్బాష్పయు గద్గదకంఠియు నగుచు నారాక్షసస్త్రీల కిట్లనియె.