Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.7.463

Āndhra Mahābhāratamu 3.7.463

Language
Telugu

3.7.463

వ. న న్నాశ్రయించిన జనంబులు దుర్గతిం బొరయరు గావున నభిమతంబు లైన వరంబు లిచ్చెద’ నడుగు మనినఁ బాండవాగ్రజుండు సంభ్రమభక్తిపరుం డగుచు దండప్రణామంబు సేసి, యద్దేవోత్తముం బ్రస్తుతించి, ‘దేవా! మదీయాశ్రమవాసుండైన భూసురవరు నరణి యొక్కహరిణంబుచేత నపహృతంబయ్యె; నతనికిం గర్మలోపంబు గాకుండ నయ్యరణిం గరుణింపవే’ యనినఁ బ్రీతచిత్తుం డగుచు ధర్మదేవుండు.