Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.263

Āndhra Mahābhāratamu 4.1.263

Language
Telugu

4.1.263

సీ. ‘అవయవ లక్షణం, బాయుః ప్రమాణంబు, | గర్భంబు, లింగితాకారములును,
మాత్రాంతరము, వయోమానంబు, దేశకా | లోచితాహార ప్రయోగభంగి,
జాత్యనురూప శిక్షావిధి, క్రమగతి | వ్యాయామ సాత్మ్య ప్రవర్తనంబు,
ప్రమద విషాదాది బహువిధ చిత్తధ | ర్మము, పోషణ ప్రకారము, చికిత్స
ఆ. పరిచితములు ధరణిపాల! నీ ముందట | రూపురేఖ మెఱయఁ జూపనేర్తు;
బవర మైన నాకుఁ బని యేమి యనఁ, జేతి | బలిమి కలిమి నెఱపఁ దలఁపు గలదు.’