Andhra Mahabharatamu 4.1.313
Āndhra Mahābhāratamu 4.1.313
- Language
- Telugu
4.1.313
వ. అనిన విని యాజ్ఞసేని యిట్లను; ‘నేను సైరంధ్రీజాతి సంభూత; నభిధానంబు మాలిని; పురుషపంచక సనాథనై యుండుదు; నొక్కకారణంబున నుద్ధతులగు విరోధులచేతం బతుల సన్నిధిం దలవట్టి యీడ్వంబడి, వనంబున కరిగి, వ్రతంబుమై వల్లభసహితంబుగా వన్యాహారంబులం గాలంబు గడపుచు బ్రహ్మచర్యంబు నడపితి; నిటమీఁద నియమాచరణంబునకు నొక్క సంవత్సరంబు గొఱంత కలదు. నీవు ధర్మవర్తిని వని వినుటం జేసి నానేర్చు పనులవెంట నీకడ నిలువం దలంచి యిందు వచ్చితి’ ననవుడు సుదేష్ణ యిట్లనియె.