Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.274

Āndhra Mahābhāratamu 4.2.274

Language
Telugu

4.2.274

వ. అనినఁ బాంచాలి సుదేష్ణ మందిరంబునం దా నుచితాచరణంబున నునికియు, సింహబలుండు సింగారించుకొని వచ్చుటయు, రేయింటి మాటలవలనం దాను బెదరమియు, వాఁడు సామ దాన భేద దండంబులు సూపి పలుకుటయు, దానికి మెయికోలు భావించికొని క్రమంబునం దగిన సంభాణంబు సేసి, నాట్యమండపంబు సంకేతస్థలంబుగాఁజెప్పి, యొక్కరుండవచ్చువాఁడవని నియమించుటయు, నద్దురా త్ముండు ప్రముదితాత్ముండగుచు రాత్రిసమయంబున నయ్యెడకు నొంటిమెయిం జనుదెంచువాఁడై చనుటయుఁ దెలియంజెప్పిన, నతండు పరమాహ్లాదంబునంబొంది.