Andhra Mahabharatamu 4.2.306
Āndhra Mahābhāratamu 4.2.306
- Language
- Telugu
4.2.306
సీ. ఇంపైన ప్రియ కాననిచ్చి, నిల్చిన మధు | వాదట నాను మత్తాలివిభునిఁ,
జెట్టుపల్ పచరించి చుట్టుఁ గ్రుమ్మరి మనో | రమ నియ్యకొలుపు మరాళవిభుని,
ఫలరస మొండొంటి కెలమిఁ జంచుల నిచ్చు | మెయిన చొక్కెడు శుకమిథునములను,
గమిఁ బాసి తలిరుజొంపమునకు మెయిమెయిఁ | దాఁకంగఁ జను పికదంపతులను
తే. జూచి చూచి యుల్లంబున నేచి కోర్కు | లడర చిడిముడిపడు, మ్రానుపడు, వెడంగు
పడు, వెనుంబడుఁ దల్లడపడు, దురంత | చింతబారికి నగపడు సింహబలుఁడు.