Andhra Mahabharatamu 4.2.325
Āndhra Mahābhāratamu 4.2.325
- Language
- Telugu
4.2.325
వ. చని వివేకరహితు హృదయంబునుం బోలెఁ దమోదూషితంబును, విదగ్ధ వనితా ప్రేమంబునుం బోలె దుర్నిరూపంబును, ఘోరాటవీ భాగంబునుం బోలె నిర్మనుష్యంబును, గాపురుష లక్ష్మీ విలాసంబునుం బోలె ననుపయోగ్యంబును, ననభ్యస్త శాస్త్రంబునుం బోలె దుర్గమంబును, స్వప్నలబ్ధపదార్థంబునుం బోలె నదృష్టి గోచరంబును, విషమ కావ్యంబునుం బోలె నస్పష్టాలంకారంబును, బాలిశు రాజ్యంబునుం బోలె జారచోర హృద్యంబునునైన యా నర్తనాగారంబు ముఖభాగ స్థలంబుసేరి.