Andhra Mahabharatamu 4.4.204
Āndhra Mahābhāratamu 4.4.204
- Language
- Telugu
4.4.204
వ. పాండవమధ్యముండు పదుమూఁడు వత్సరంబులు పూఁచి పట్టి కయ్యంబునకు వచ్చె; నతని లావును బీరంబును లోకంబునకు నెక్కియున్న యవి; యేనును గురుసేనయందు శక్తి శౌర్యంబులు గలవాఁడన పోలె వర్తించెదం, గావున నే మిరువురము నొండొరులకు బాహుబల విలాసంబును, విక్రమ క్రీడా కౌశలంబును బ్రకటించుట యుచితంబు గాదె’ యని వెండియు నిట్లనియె.