Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.237

Āndhra Mahābhāratamu 4.4.237

Language
Telugu

4.4.237

వ. అనిన నయ్యిరువుర వచనంబు లాకర్ణించి గురుం డిట్లనుఁ, ‘గార్యగతియును గయ్యంబు భంగియు భూపతి కంటె మిగులం గనియెడు వారులే, రయినను నా యెఱింగిన యంత నొక్క తెఱంగు సెప్పెద; నీ బలంబున నాలవ పాలుగొని మహీపాలుండు సత్వరంబుగా ముందర పోవలయు; నంతియసేన తదనంతరంబ కదుపులం బొదివికొని చనవలయుఁ; దక్కటి సగంబుతో మనము నిలిచి మోహరించి యల్లనల్ల నరుగవలయుఁ; గవ్వడి యెయ్యెడం గవిసె నయ్యెడన తలపడ వలయు; నిట్లైన మానవేశ్వరుండు సురక్షితంబుగా సందడింబడక నడచు; గోవులు నిన్నేలం గడచు; మనమును ధనంజయునకుం జాలిన యప్పుడ యటఁ దోడుపడ నెవ్వరు గలిగినను వారికిం జాలి నిలుత’ మనిన, విని, సురనదీసూనుండు దాని కియ్యకొని రాజన్యునకు సైన్యంబుఁ బంచి యిచ్చి, పుచ్చి, పసులకుం దోడగు భాగంబునుం బంచి, యున్నంత వట్టు చతురంగంబుల నియతి సేసికొని, యాచార్యుండు నడుమను, గృపాచార్యుండు వలపటను, నాచార్యపుత్త్రుండు దాపటం, గర్ణుండు ముందట, వికర్ణ దుశ్శాసన శకుని సైంధవ సోమదత్త బాహ్లిక భూరిశ్రవః ప్రభృతి యోధ వీరులెల్ల నెడనెడం గలయ నిలుచునట్లుగా మోహరించి, మహోత్సాహంబున సన్నాహ సౌందర్యంబు నొంది, తాలధ్వజం బెత్తించి, మెఱసి తాను వెనుకయయి నడిపించుచుండె; నట్టి సమయంబున.