Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.265

Āndhra Mahābhāratamu 4.4.265

Language
Telugu

4.4.265

వ. తేరు సమ్ముఖంబు సేయించి పేరు వాడి క్రీడి కరతలం బెత్తి ‘నిలు నిలు’ మని యదల్చిన ఘోషంబు తోడన వెడలు నిశిత శర పరంపరల దట్టంపుఁ బఱపున నంబరంబు నీరంధ్రం బగుటయుఁ దదంధకారంబును భయతిమిరంబునుం గలసి గుండియ లవిసి కురుబలంబు లెదురు నడవను మఱలం బఱవను మఱచి, వెఱచఱచి హరితనయ హస్తలాఘవప్రశస్తి దక్కందక్కిన చేష్టలు దక్కియుండె; నతండు గోవుల వెనుకం బోవు నల్పబలంబు బెదరి తూర్పు దెసకుం జెదరునట్లుగా నరదంబుఁ బఱపించి తెఱపి సూపి వెలిచీర సారించి దేవదత్తంబు పూరించినం గేతుకపి గర్జిల్లం, దదీయ భూతంబు లార్వ, మౌర్వీ రవంబును, రథనినదంబును, బ్రతిపతాకినీ తుములంబును, గగనంబునం బొగడు నమరుల యెలుంగులును నొక్కటఁ జెలంగ సముదిత సాంద్ర సంరావంబు రోదసీ కుహరంబు నిండిన, నొండొండ తోఁకమట్ట లెత్తుకొని నేలమట్టవియుచు నద్రువం బసులు వెసం దిరిగి మున్ను వివ్వచ్చుండు వచ్చిన జాడ గైకొని దక్షిణదిశకుఁ గెరలు వొడుచుచుం దెరలం బాఱిన.