Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.228

Āndhra Mahābhāratamu 5.2.228

Language
Telugu

5.2.228

వ. అనిన సుయోధనునకు సూతనందనుం డర్జును దివ్యరథ శ్వేతాశ్వ కపిధ్వజ దేవదత్తంబుల మహానుభావంబులు వేఱువేఱ వర్ణించి చెప్పి, యుధిష్ఠిర భీమ నకుల సహదేవుల యరదంబులు, తురంగాది పరికరంబు లిట్టిట్టి వని యేర్పడం బలికి, విరాట ద్రుపదాదులకు వలయు నుపకరణంబులు గొఱంత లేమియు నెఱింగించిన, ధృతరాష్ట్రుం ‘డిందుఁ గల బలు మానుసు లెవ్వరికి నసాధ్యులు. వీరి సాధించుతెఱం గూహించిరే?’ యని యడిగిన నతనికి సంజయుం డిట్లనియె: