Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.244

Āndhra Mahābhāratamu 5.2.244

Language
Telugu

5.2.244

వ. అతండు ధర్మతనయుతో నిట్లను: ‘గాంగేయ కుంభసంభవాది మహావీర క్రూరసత్త్వ బహుళంబును, గరిఘటా గిరి కదంబ కలితంబును, దురంగ నికర తరంగ పరంపరా ఘోరంబు నగు కౌరవసేనా సముద్రంబునకు నేనొక్క చెలియలికట్టనై నిలిచెద’ ననవుడు నయ్యుధిష్ఠిరుండు ‘నీ వింతకుఁ జాలుట యెవ్వరు నెఱుంగరే? యెట్లును సంగరంబున మమ్ముద్ధరింపు’ మనియె; నిట్లు గొనియాడిన, నాతండు నా దెసం గనుంగొని, ‘సంజయా! మీ వారల కెల్లనుం దెలియం జెప్పు; మీశ్వరాది దేవతలు సమకట్టిన సవరణగల యర్జునుచేత నిర్జింపంబడిన యుత్కృష్టజాతు లనేకు లగుట యెఱుంగుదుర కాదె? మనుష్యు లతనికెంత పెద్ద? యిట్టి జెట్టి వెన్నుదన్ని చూడఁగలవాఁడు గావున, మముబోంట్లెల్లఁబోక పెనంగినం, బోరు భరంబైనం, బ్రాణంబులపై వచ్చు; నంతకంటెను బరమ దయాపరుండైన పాండవాగ్రజు మఱువు సొచ్చి బ్రదుకుం డను; మంతలంతలు దప్పులు సేసితి మని తలంక వలవ; దెంత సేసినను, గౌంతేయ పూర్వజుండు శాంతి సుధానిధి యగుటంజేసి శరణు సొచ్చినం గాచు’ నని పలికె’ ననిన విని ధృతరాష్ట్రుండు దుర్యోధనున కిట్లనియె: