Andhra Mahabharatamu 5.2.256
Āndhra Mahābhāratamu 5.2.256
- Language
- Telugu
5.2.256
వ. అని పలికి, యతని వలనం బలుకుగానక మనంబు మరలంబెట్టు కొని కొడుకులు జయింప నోపుదురొకో యను నాస సంజయు దిక్కు మొగంబుసేసి పాండవ కౌరవ పక్షంబులం గలవారి నడుగుచుం, గొలందులు దలపోయుచు, నాతని వచనంబులం దన విచారంబులను బలాబలంబులు నిశ్చయించి, పాండవేయు లెక్కు డవుట యెఱుంగుచుఁ, గ్రమ్మఱ నా సూతపుత్రుతో లెక్కలు వెట్టుచుం, బోలించుచుఁ, బెద్దప్రొద్దు వితర్కించి, కౌంతేయుల శక్తి దేవశక్తియు, గాంధారేయుల శక్తి మనుష్యశక్తియుంగాఁ దెలిసినవాఁడై, యంబికానందనుండు నిజనందనునితో నిట్లనియె: