Andhra Mahabharatamu 5.2.262
Āndhra Mahābhāratamu 5.2.262
- Language
- Telugu
5.2.262
వ. కావున వా రొకళ్ళవారుం గా; రట్లుంగాక పక్షపాతులై పూని వత్తురయేని నది దేవత్వంబు గా; దట్టి దేవత్వంబున నర్జునుండును సురక్షితుండు గానేరఁడు; నీకు నా పనికిఁ జింత వలవ’ దని పలికి, వెండియు నిట్లనుఁ; ‘బెఱిగి వచ్చు కార్చిచ్చు నుడుపను, బాషాణ వర్షంబు వారింపను, మహావాయువు నిలుపను, నీళ్ళు గట్టిగా నభిమంత్రించి వానిపైఁ గరి తురగాదుల నడపింపను, నా సేన నడచునప్పుడు వలసినచోట జలంబు లుత్పాదింపను జాలుదు; సింహ శరభ శార్దూల భూత బేతాళాది క్రూరసత్త్వ సంరంభ స్తంభన ప్రకారం బెఱుంగుదు, మిత్త్రశత్రు విషయంబులైన శుభాశుభంబులు వలయుభంగి నావహింపనేర్తు; మఱియు నానావిధ సిద్ధి ప్రదంబులగు మంత్ర ధ్యానాద్యనుష్ఠానంబుల నాకుం గొఱంత లేదు; నీ చెప్పిన యగ్నిప్రముఖ దేవతలం బ్రసన్ను లగునట్లుగా నారాధించినవాఁడ; వారికి నాకుం బోలె మహానుభావంబు గలిగినఁ బదుమూఁడు వత్సరంబు లబ్భంగి నిడుమలం బడుదురె? వినుము చెప్పెద.