Andhra Mahabharatamu 5.2.265
Āndhra Mahābhāratamu 5.2.265
- Language
- Telugu
5.2.265
వ. ధర్మతనయాది పాండవేయులును, ద్రుపదాది పాంచాలురును, విరాటాది మాత్స్యులును, వాసుదేవాది యాదవులును, మఱియునుం గేకయ పాండ్య మాగధ చైద్య ప్రముఖ నిఖిల దండనాయకులును నాబారింబడి మున్నీరు సొచ్చిన యేఱుల చందంబున నడంగిపోవుట యవధరించెదుగాక! వారెల్లఁ దేజోధైర్య పరాక్రమోపాయ విచార వివేకంబుల నాయెత్తు వత్తురె? పితామహ ద్రోణ కృపాశ్వత్థామలు శస్త్రాస్త్ర విషయంబులుగా నేమేమి యెఱుంగుదు రెంతెంత నేర్తు రది యెల్ల నెఱుంగుదు; నంతయు నేర్తు’ నని పలికి, యందఱు వెఱఁగుపడియుండం, దాను సంజయుతో సంగరంబు తెఱంగు నాలోచనంబుగాఁ బాండవుల దెస మాటలాడుచుండఁ గర్ణుండు ధృతరాష్ట్రుం గైకొనక, ధార్తరాష్ట్రునకుం బ్రియంబుగా నిట్లనియె: