Andhra Mahabharatamu 5.2.320
Āndhra Mahābhāratamu 5.2.320
- Language
- Telugu
5.2.320
వ. ‘విద్యయు నవిద్యయు ననఁగా రెండు గల; వవిద్యాదూషితుండై తమోగ్రస్తుండైనవాఁడు విష్ణు నెఱుంగఁడు. విద్యాసంపన్నుం డెఱుంగు’ ననిన, ‘విద్య యనునది యెట్టి? దెద్దాన నీవా సర్వేశ్వరు నెఱింగితి? దాని, నవిద్య యెట్టిది? దానిని జెప్పు’ మనుటయు, నాంబికేయునకు సంజయుం డిట్లనియె: ‘సాత్త్విక రాజస తామస వికారంబుల త్రిప్పులంబడక ధర్మం బాచరించుచు భావశుద్ధి గలిగి యుండుదు; దీన నే నచ్యుతు నెఱుంగుదు; విద్య యిట్టిది. నీకునుం, దక్కెవరికైనను నతని నెఱుంగుటకు నిదియ తెరు; విట్టిదిగాని విధం బవిద్య’ యని చెప్పిన, నతండు నిజనందనున కిట్లనియె: