Andhra Mahabharatamu 5.2.325
Āndhra Mahābhāratamu 5.2.325
- Language
- Telugu
5.2.325
వ. అనియె; నట్టి యెడం గృష్ణద్వైపాయనుండు ధృతరాష్ట్రునకిట్లను ‘కృష్ణుండు నీకుం గూర్చు; నీవుం బరమాప్తుండైన సంజయు నతనిపాలికిం బుచ్చి; తది లెస్స కార్యం బయ్యె, వీఁడును నమ్మహానుభావు మహనీయ ప్రభావం బున్నరూ పెఱుంగు. వీని బుద్ధి విని యద్దేవు నాశ్రయింపు; మతం డేకాగ్రచిత్తులై యారాధించినవారికిఁ జేరువ యగుఁ; గామక్రోధోపహతులై తమ తమ ధనంబులం దృప్తులు గాక యన్యాయంబున వర్తించువారలకు దూరంబై యుండు; నెల్లభంగుల నాతనిం జొచ్చి బ్రదుకు;’ మనినం, ‘బ్రసాదం బట్ల చేయుదు’ నని, విచిత్రవీర్యనందనుండు సూతనందనునితో ‘నవ్వాసుదేవ నామ నిర్వచనంబు నాకుఁ దేటపడం దెలిపి యతనిం బొందు నుపాయం బుపదేశింపవే’ యని యడిగిన.