Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.331

Āndhra Mahābhāratamu 5.2.331

Language
Telugu

5.2.331

వ. అని పలికి పరమశాంతుండై పారాశర్యు నుద్దేశించి ‘దేవా! యేను వాసుదేవుని శరణు సొచ్చి బ్రదుకువాఁడ’ ననుచుఁ గృతాంజలి యగుటయు వ్యాసమహామునియు నాశీర్వాదంబు సేసి యంతర్హితుం డయ్యెఁ; గౌరవేశ్వరుండును దుర్యోధన సంజయుల నిజ నివాసంబులకుం బోవం బనిచి, తానును గాంధారియు నభ్యంతర మందిరంబున కరిగి, యుచిత వ్యాపారంబులం బ్రవర్తిల్లుచునుండె’ నని చెప్పిన విని ‘పదంపడి పుట్టిన విశేషంబు లెట్టి’ వని యడిగిన.