Andhra Mahabharatamu 5.3.209
Āndhra Mahābhāratamu 5.3.209
- Language
- Telugu
5.3.209
వ. అనినం బ్రసన్నవదనుం డగుచు నద్దేవి గారవించి యామంత్రణంబు సేసి తదావాసంబు వెలువడి తనరాకకు నలంకృతంబైన దుర్యోధను మందిరంబునకుఁ గృతవర్మ సాత్యకి సమేతుండయి పోవు గోవిందునిం గని తదీయ ద్వారపాలకులు సంభ్రమంబునం బఱచి యతని కెఱిఁగించి తదనుమతంబునం బఱతెంచి యెదుర్కొని కక్ష్యాంతరంబుల సందడి నెడగలుగ జడియుచు వినయంబునం దోడ్కొనిచన నమ్మనుజవిభుండు కైలాసశిఖరాకారంబగు సౌధంబున బాహ్లిక భీష్మ ద్రోణ ప్రభృతులును, గర్ణశకుని సైంధవాదులును, దుశ్శాసన వికర్ణ దుర్ముఖ ప్రముఖులును మఱియు ననేక దేశాధీశులునుం బరివేష్టింపఁ బేరోలగంబున సింహాసనాసీనుండై యున్న యెడకుం జను నప్పు డాసుయోధనుండు సపరివారంబుగాఁ బ్రత్యుత్థానంబు సేయం జేర నరిగి యతనికిం దగువారలకు నాలింగనాద్యుపచారంబులు తానుం దమ్ముండును నాచరించి.