Andhra Mahabharatamu 5.3.302
Āndhra Mahābhāratamu 5.3.302
- Language
- Telugu
5.3.302
వ. ఇవ్విధంబునం గేశవుండు గరుణించి గరుడని ననునయించి ‘యింక నవుదానికి నుద్ధతి మాని బుద్ధిగలిగి యుండు’ మని వీడ్కొలిపి పుచ్చినం బోయెం; గావున గర్వంబు గొఱగా’; దింతయు నీ మహానుభావుం డెఱుంగునని నారదుం జూపియితండు మాతలి కన్యా కార్యంబునకుఁ దోడైనడచె; నడుగు; మదియకాదు సర్వేశ్వరుం డగు మాధవు మాహాత్మ్యం బితనికిం గరతలా మలకం బయి యుండు; బ్రభవిష్ణుండగు నాదివిష్ణుండు గదా యీ కృష్ణుం డీతని సహాయత్వంబు గల కౌంతేయులతోడం గూడి మనికి కార్యం’ బనిన నారదుండు ధార్తరాష్ట్రు నాలోకించి.’