Andhra Mahabharatamu 5.3.316
Āndhra Mahābhāratamu 5.3.316
- Language
- Telugu
5.3.316
వ. ఒక్క సమయంబు సేసికొని యిచ్చి గుఱ్ఱంబులు వచ్చినవి యెల్లరాఁబుచ్చి కొమ్మనిన గాలవుండు నవ్విధంబునకు సమ్మతించె; నపత్యార్థియై యిక్ష్వాకుండును నయ్యుంకువునకు భార్య యగుట పుత్త్రజన్మావధిగా నొడివి యశ్వంబుల నొసంగి కన్యకం బరిగ్రహించి దానియందు వసుమనస్సుండను కొడుకుం బడసి గాలవునకు నమ్మగువను మగుడ సమర్పించినఁ జూచి యబ్భంగిం గలచోట్ల నెల్ల నరసి తురంగంబులం గావించికొమ్మని యతనికిం జెప్పి సుపర్ణుండు సనియె; మఱియు మహీతలంబునం గ్రుమ్మరి యమ్ముని కుమారుండు గందువ లెఱింగి పోవంబోవ.