Andhra Mahabharatamu 5.3.318
Āndhra Mahābhāratamu 5.3.318
- Language
- Telugu
5.3.318
వ. ఇట్లు క్రమంబునఁ గాశీశ్వరునకుఁ బ్రతర్దనుని భోజపురనాథునకు శిబిం గనిన యక్కన్యకఁ గొని వెండియు వసుంధరం దిరుగుచుండ గరుత్మంతుండు గ్రమ్మఱి వచ్చి యమ్మునితో నీ వింక జాలింబడ వలవ; దొక్క కారణంబున నీ రాజులు మువ్వురకు నివ్వాజులు గలిగె; నింతియకాని యొండెడ నీచందంబున మొత్తంబులై దొరకనేర; వియ్యాఱునూఱు గుఱ్ఱంబులను గురువునకు సమర్పింపు; మొక్కటి సెప్పెద విను’మని యిట్లనియె.