Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.405

Āndhra Mahābhāratamu 5.3.405

Language
Telugu

5.3.405

వ. అనియె నట్టియెడఁ గట్టెదురనున్న యక్కురుపతికుమారుం జక్కం జూచి యేనొక్కరుండన యని తలంచియె దుర్మదంబునం బొదివి పట్ట నుత్సాహంబు సేసితనుచు దరహాసంబు సేయు వాసుదేవుని ఫాలప్రదేశంబున బ్రహ్మయు, వక్షంబున విరూపాక్షుండును, వదనంబున వహ్నియుఁ, బార్శ్వంబుల నింద్ర యమ వరుణ కుబేరులు నాదిత్యమరుద్విశ్వేదేవాశ్వినులు నుద్భవించిరి హలగాండీవ మండిత బాహులగు బలదేవార్జునులు సవ్య దక్షిణ భుజంబులను, నిజాయుధ హస్తులగు యుధిష్ఠిర భీమ నకుల సహదేవులు వీఁపునను. వివిధ ప్రహరణ పాణులగు యదువృష్ణి భోజాంధక వీరు లూరులను బ్రభవించిరి; జనిత నానాహస్త విన్యస్తంబులయి శంఖచక్ర గదా ఖడ్గ శక్తి శార్ఙ్గ ప్రముఖ నిఖిల సాధనంబులు వెలింగె; నేత్ర శ్రోత్ర నాసా వివరంబుల సధూమ ధూమకేతు జ్వాలా జాలంబులు నిగిడె; రోమకూప కలాపంబులం దరణి కిరణ నిభ ప్రభలు వెడలె; నిట్లు దుర్నిరీక్షంబగు నత్తేజోరూపంబుఁ గనుంగొనం గొలఁదిగాక సకల జనంబుల నయనంబులు మొగిడ్చి యద్భుత భయానక రసంబుల జొత్తిల్లు చిత్తంబుల తోడం గదలకుండ నప్పుండరీకాక్షుండు నారదాది మహా మునుల వలనను భీష్మవిదుర ద్రోణ సంజయుల యందును గరుణా తరంగితంబగు కటాక్ష వీక్షణం బొలయ వారలకు దివ్య దృష్టి యొసంగిన నా పుణ్యపురుషులు సాంద్రానందంబునం దేలుచుండి; రయ్యవసరంబున.