Andhra Mahabharatamu 5.3.411
Āndhra Mahābhāratamu 5.3.411
- Language
- Telugu
5.3.411
వ. తదనంతరంబ దామోదరుండు ధృతరాష్ట్రు నభిమతం బొడఁగూడ నతని కన్ను లెప్పటియట్ల కావించి, నిజ విశ్వరూప ప్రపంచంబు నుపసంహరించి, మునీంద్రుల నామంత్రణంబు సేయ నమ్మహాత్ము లంతర్ధానంబు సేసిరి; దానును సముత్థానంబు సేసి యంతకుమున్న సన్నిహితులైయున్న కృతవర్మ కరంబును, సాత్యకి హస్తంబును నవలంబించి యూరక వెడలెనని చెప్పిన.