Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.223

Āndhra Mahābhāratamu 5.4.223

Language
Telugu

5.4.223

వ. కాంభోజరాజగు సుదక్షిణుండు సమరథుం; డితనిపాల రథబృందంబులు మేలు గలుగుఁ, బాండవ బలంబులం గలంచు; మాహిష్మతీపతి యగు నీలుం డర్ధరథుం డితనికి సహదేవునకుఁ దెగని పగయై యుండు; దానం జేసి యాలంబున నోలమాసగొనం; డవంతిదేశాధీశులగు విందానువిందు లర్ధరథులు; పరస్పర స్నేహంబున సాహసికులై యొకళ్ళొకళ్ళం బెట్టి పోవక పోరుదురు; త్రిగర్త పతులు తోడంబుట్టువులేవురును మహారథులు; గోగ్రహణంబునం బడిన బన్నంబుఁ బాపికొనం గడంగుదురు; వీరికి భుజబలం బగ్గలంబై యుండు.