Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.252

Āndhra Mahābhāratamu 5.4.252

Language
Telugu

5.4.252

వ. అనియాడి మొగంబు గంటు వెట్టుకొనియున్న సురనదీసూను దిక్కు మొగంబై సుయోధనుండు ‘నీకుం గోపింప నగునె; నన్నును గార్యభారంబునుం జూచి నా బ్రదుకునకై సర్వంబును సహింపలయు’నని తేర్చి యంగ రాజుం గనుంగొని ‘మీ రిద్దఱు నొక్కటియై భరంపడి యిప్పని సక్కంజేసి కాక మీలోన నిట్టి యెరవు మాటలేల?’ యని పొదివి పలికి, తదనంతరంబ పాండవ పక్షంబు వారల తారతమ్యంబులు వినువాఁడై యమ్మాట పుట్టించిన నతనికి భీష్ముం డిట్లనియె: