Andhra Mahabharatamu 5.4.274
Āndhra Mahābhāratamu 5.4.274
- Language
- Telugu
5.4.274
వ. ఇవ్విధమునం జని యమ్మహోత్సవంబున నలంకృతలై యున్న యంబయు నంబికయు నంబాలికయు ననుముద్దియల మువ్వురంబట్టి రథంబుపయిఁబెట్టి కొనిరా నచ్చటి రాజులెల్లను జతురంగ బలంబులతో వచ్చి నన్నుం బొదివినఁ, బటువిశిఖానల శిఖా కలాపంబున వేఁడిమి చూపి వారి నిలువరించి, యరుగుదెంచి సత్యవతికి నప్పొలంతుల నొప్పించిన నద్దేవి విచిత్రవీర్యునకు వారల వివాహంబు సేయ నుద్యోగించె; నట్టియెడ నమ్మువ్వురయందుం బెద్దయదియైన యంబయను కన్యక నాతో నిట్లనియె: