Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.288

Āndhra Mahābhāratamu 5.4.288

Language
Telugu

5.4.288

వ. అని చెప్పు నవసరంబున నయ్యాశ్రమంబునకు హోత్రవాహనుండను రాజర్షి వచ్చిన నమ్మును లభ్యాగత పూజలు చేసిన యనంతరంబ యంబం గనుంగొని ‘యిక్కన్నియ యెక్కడిది? దీని విషాదంబునకుం గారణం బే?’మని యడిగి, వారివలన దాని జన్మప్రకారంబును దద్వృత్తాంతంబును విని, తన కూఁతుకూఁతు రగుట యెఱింగి యయ్యంగన వినం దపస్విజనంబులకుఁ జెప్పి, యప్పొలంతిం దన యంకతలంబున నునిచికొని వెండియు నడుగ సవిస్తరంబుగా నచ్చేడియ చెప్పిన విని, శోకించి యవ్విషమ ప్రకారంబునకు నిస్తారంబుఁ జింతించి.