Andhra Mahabharatamu 5.4.315
Āndhra Mahābhāratamu 5.4.315
- Language
- Telugu
5.4.315
వ. అని పలికి యతనికిం బ్రణమిల్లి చనుదెంచి, సత్యవతి కింతయు విన్నవించి, యద్దేవి యనుమతి వడసి, సర్వసన్నాహ సమేతంబగు రథం బెక్కి విప్రాశీర్వాదంబులు చెలంగ వెడలి వచ్చి కురుక్షేత్రంబు దఱియం జనునెడ, భాగీరథి భామినీ రూపంబున నరుగుదెంచి ‘తన్నెఱింగించి, మదీయభక్తి నభినందించి యే నాయితంబై పోవుటకుఁ గారణం బడిగి, నా చేత నత్తెఱం గెఱింగినదియై నన్నుం గినిసి, భార్గవుపాలికిం జని ‘నీ శిష్యుండు నిరపరాధుండు నా కొడుకున కలుగం దగునే?’ యని చెప్పి, యతని యందుఁ బిక్కు గానక మగుడ నేతెంచి, నావలనను మెత్తంబాటులేకున్నం జనియె; నప్పుడు సిద్ధ విద్యాధర ముని గణంబులు గౌతుకంబునం గనుంగొనుచుండ నేను జమదగ్ని తనయున కనతిదూరంబునం దేరుడిగి వినతుండనై నిలిచి ‘నీవు భూచారివై యున్నవాఁడవు; రథికుండనైన నాకు నీతోడ సమరంబు చేయనగునే?’ యనిన యనంతరంబ యతండు దివ్యంబులగు రథ రథ్యంబులు శస్త్రాస్త్రంబులునుం గలిగి యకృతవ్రణుండు సారథిగా సమర సన్నద్ధుండై తోఁచినం జూచి రథారోహణంబు చేసి శంఖంబు పూరించి గుణంబు సారించి సూతు నగ్గించి తనకు నమస్కరించి కడంగిన నప్పరశురామదేవుండు.