Andhra Mahabharatamu 5.4.338
Āndhra Mahābhāratamu 5.4.338
- Language
- Telugu
5.4.338
వ. ఇవ్విధంబునం బోరి సూర్యాస్తమయం బగుటయు నెప్పటియట్ల చని యే నా రాత్రి యేకాంతంబున దర్భశయనంబున నుండి సురభూసుర వర్గంబులం దలంచి భక్తిం బ్రణామంబులు సేసి ‘పరశురాముని జయింపరా దయ్యెడు, దినంబులు పెక్కులు సనియె, నతని నాజి జయించుటఁ గలుగునేని మీరు నాకుం దోఁచి యూఱడింపవలయు’ నని ప్రార్థించి నిద్రించుచుండం బవలు నన్నెత్తి రథంబుపయిం బెట్టిన యెనమండ్రునుం బ్రభాత సమయంబునం గలలోన వచ్చి.