Andhra Mahabharatamu 5.4.358
Āndhra Mahābhāratamu 5.4.358
- Language
- Telugu
5.4.358
వ. అనిన నతండు పోక పెనంగిన వెండియు ననేక ప్రకారంబులం జెప్పి యమ్మునులు నాకడకుం జనుదెంచి యుపశమన వాక్యంబులు పలికి జామదగ్న్యుతోడం దమయాడిన మాటలు తేటపఱిచి యప్పుడు పొడసూపిన జాహ్నవియుం దారు బహు విధంబుల నన్ను ననునయించి భార్గవుపాలికి నమ్మహాదేవిం దోడ్కొని యరిగియుం గ్రమ్మఱ మత్సమీపంబునకు వచ్చియు నెట్టకేలకుం జలం బుడిపిన నే మిరువురమును దివ్యాస్త్రంబులుప సంహరించి సమరం బుడిగితి; మట్టియెడ నయ్యెనమండ్రు విప్రులుం జేరి నాతో నిట్లనిరి: