Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.364

Āndhra Mahābhāratamu 5.4.364

Language
Telugu

5.4.364

వ. అనిన విని భాగీరథి ‘కుటిల ప్రచారవగుట నీవీ తనువు విడిచి యేఱయి పాఱంగల దాన; వింతియకాని యొండు గానేర’ వనిన న వ్వెలంది నవ్వుచు సరకు చేయక యరిగి తొంటికంటెను దీవ్రంబగు తపశ్చరణంబునం బ్రవర్తిల్లుచు మత్స్యదేశ వాసినియై యుండి నాఁడు నిజవ్రత ఫలంబులో సగంబున నంబయను పేర నదియై య మ్మండలంబునం బరఁగియున్న సగంబునను దనరూపు చెడకుండ వహించికొని జాహ్నవీ ప్రభావంబు నాత్మీయ ప్రభావంబున గెలిచి వెండియు.