Andhra Mahabharatamu 5.4.373
Āndhra Mahābhāratamu 5.4.373
- Language
- Telugu
5.4.373
వ. ఇట్లు పుట్టిన బిడ్డకుఁ బుత్త్ర ప్రకారంబున జాతకర్మాది కృత్యంబులు నిర్వర్తించి శిఖండి యనుపేరుపెట్టి యతి ప్రచ్ఛన్నంబుగాఁ బెనిచి రహస్యంబు తెఱం గా కన్నియకుం జెప్పి’ యక్షర శిక్షాదు లాచరించి ద్రోణాచార్యుకడ శస్త్రాస్త్ర పరిశ్రమంబు సేయించుచుండ జవ్వనంబు చేరువకుం దఱియగుటయు నమ్మగువం జూచి వగచి తల్లిదండ్రులు తమలో విచారించి ‘వేగంబ వివాహంబు సేయవలయుఁ; బరమేశ్వరు వరంబు కొఱంత వడునె? తన నెఱసినప్పుడు నెఱయుంగాక!’ యని నిశ్చయించి దశార్ణ దేశాధీశుండగు హేమవర్మ యను రాజు కన్యకం దగిన తెఱంగునఁ బాణిగ్రహణంబు సేయించి తెచ్చియున్నంత.