Andhra Mahabharatamu 5.4.391
Āndhra Mahābhāratamu 5.4.391
- Language
- Telugu
5.4.391
వ. తదనంతరంబ సూర్యోదయం బగుటయుఁ గాలోచిత కరణీయంబులు నిర్వర్తించి, పాంచాల విభుండు సంబంధితో వలయు మాట లాడందగు వారలం బనిచి, రావించి సంభ్రమంబు లేక వేగిరపడక నాగరిక ప్రకారంబున శిఖండి పురుషత్వంబు దేటపఱిచి యతని మాట గీడ్పఱచి, సపరివారంబుగా నద్దశార్ణపతికి విందువెట్టి కట్టనిచ్చి, యతని యనునయాలాపంబు గైకొని యనిచి పుచ్చిన, నతండు తన్నుందాన నిందించు కొనుచు నిజపురంబునకుం బోయె; నట్టియెడ నయ్యక్షవరుమందిరంబు చక్కటికిం గ్రీడార్థంబు గిన్నర విభుండు విమానారూఢుం డయి చని దాని యొప్పు గనుంగొని యగ్గించుచు నిల్చి యొక్కింత సేపునకుం జుట్లనున్న గుహ్యకులతో నిట్లనియె.