Andhra Mahabharatamu 5.4.425
Āndhra Mahābhāratamu 5.4.425
- Language
- Telugu
5.4.425
వ. అది యెట్లంటే నిఁ గృత్రిమ కిరాతుండైన పశుపతి మెచ్చి జగత్సంహార సమయంబునం దాను బ్రయోగించునట్టి పాశుపత మహాస్త్రంబు నాకిచ్చె; నది నాయందు సన్నిహితంబయి యున్నయది గావున శత్రునిరాసం బనా యాసంబై యుండు; నప్పాశుపత మహనీయ ప్రభావంబు భీష్ముండున్నరూపెఱుంగఁడు, ద్రోణ కృపాశ్వత్థామలు నెఱుంగరు, కర్ణున కెఱుంగ నెంతదవ్వట్టి ఘోర సాధనంబున సమస్తంబును సమయించుట యుక్తంబు గాదు తక్కిన యాయుధంబులం బోరి వైరులం బరిమార్చినం బౌరుషంబు దీపించు నని తలంచెద; నప్పటికి వలయు విధం బయ్యెడు; నది యట్లుండె; నీవా రక్కడి వారికిం దక్కువవారే? భీమసేనుండు కవ లభిమన్యుండు ద్రౌపదేయులు సాత్యకి విరాట ద్రుపదులు ధృష్టద్యుమ్నుండు శిఖండి యుత్తమౌజుండు యుధామన్యుండు ఘటోత్కచుండు మొదలైన జగజెట్లున్నవారు; మఱియు ననేకులు వీరల యట్టివారలు కలరు; వారల నందఱం జెప్పనేల? యేనుంగువోలె నీలావు నీవెఱుంగవు దివిజులకు నజేయుండవు నీయొక్కనికిఁ ద్రిభువనంబు నెదురె నీవు నిక్కం బలుగవుగాక; నీ వలిగిన నెవ్వ రెట్లయ్యెదరో యటు సూడుము; నీ సైన్యంబుల నెవ్వరికి నేమి చేయవచ్చు మనకు విజయానందంబు సులభంబ’ యని పలికె నని సంజయుండు ధృతరాష్ట్రున కెఱింగించె’ నని వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పుటయు.