Andhra Mahabhagavatamu 5.2.5
Āndhra Mahābhāgavatamu 5.2.5
- Language
- Telugu
5.2.5
భావము:- ఈ విధంగా ప్రియవ్రతుడు పదకొండు అర్బుద సంవత్సరాలు రాజ్యం చేసాడు. ఒకనాడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్న సూర్యునికి ఆవలి భాగంలో కనిపించే చీకటిని రూపుమాపాలని అనుకున్నాడు. భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించడం వల్ల కలిగిన శక్తితో సూర్యుని రథంతో సమానమై తేజోమయమైన రథం ఎక్కి రాత్రులను పగళ్ళుగా మారుస్తానంటూ రెండవ సూర్యునిలాగా వెలిగిపోతూ ఏడుమార్లు సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేసాడు. అప్పుడు ప్రియవ్రతుని రథచక్రాలు గాళ్ళ వలన పడిన దారులు సప్త సముద్రా లయ్యాయి. ఆ గాళ్ళకు నడుమ ఉన్న భూమిపై సప్తద్వీపాలు ఏర్పడ్డాయి.
తెభా-5.1-19-సీ.
సరస జంబూ ప్లక్ష శాల్మలిద్వీప కు-
శ క్రౌంచ శాక పుష్కరము లనఁగ
నలరు నా ద్వీపంబులందు జంబూద్వీప-
మొనరంగ లక్షయోజనము లయ్యె;
నట యుత్తరోత్తరాయత సంఖ్యఁ దాద్విగు-
ణిత మయి యొండొంటి కతిశయిల్లు