Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.1.115

Āndhra Mahābhāratamu 1.1.115

Language
Telugu

1.1.115

వ. అనవుడు నద్దివ్యపురుషువచనంబున నత్తురంగంబు నెక్కితత్‌క్షణంబ యయ్యుదంకుండు గురుగృహంబునకు వచ్చె; నిట గురుపత్నియు శుచిస్నాత యై నూతనపరిధానశోభిత యై యక్కుండలంబులు దొడువ నవసరం బైనఁ దదాగ మనంబు గోరుచున్నయది యప్పు డయ్యుదంకుం గని తద్దయు సంతసిల్లి, తదానీతరత్నకుండల భూషిత యై, బ్రాహ్మణులం బూజించి నిజసంకల్పిత మహోత్సవం బొనరించె; నట్లు గురుకార్యంబు నిర్వర్తించియున్న యుదంకుం జూచి గురుం డి ట్లనియె.